{"product_id":"what-your-doctor-doesnt-know-about-nutritional-medicine","title":"WHAT YOUR DOCTOR DOESN'T KNOW ABOUT NUTRITIONAL MEDICINE MAY BE KILLING YOU (Telugu Edition)","description":"\u003cp\u003eతన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు పనికివచ్చే సమాచారం ఉన్న ఈ పుస్తకం ఆవశ్యకత ప్రతి ఒక్కరికీ ఉంది. - క్రిస్టియానె నార్ప్, ఎం.డి. (ద విజన్ ఆఫ్ మెనోపాజ్ ఎండ్ విమెన్స్ బాడీస్, విమెన్స్ విజమ్ గ్రంథాల రచయిత) ఆరోగ్యంగా, పరిపూర్ణంగా జీవించేందుకు అవసరమైన సమాచారాన్ని దా॥ ఫ్రెండ్ ఒక అద్భుతమైన బహుమతిగా ఇస్తున్నారని అనుభవపూర్వకంగా నాకు తెలుసు. అత్యంత నిర్దుష్టంగా, శాస్త్రీయంగా రూపొందించబడిన ఈ గ్రంథం క్షీణింపజేసే వ్యాధులను, అకాల వృద్ధాప్యాన్ని ఎదుర్కోవటంలో మీకు సాయపడుతుంది. - డెనిస్ వేట్లీ, పిహెచ్.డి. (ద సైకాలజీ ఆఫ్ విన్నింగ్ గ్రంథ రచయిత) మందులతో రోగాలకి చికిత్స చేయడంలో అమెరికన్ డాక్టర్లు శిక్షణ పొందారు. కాని మీరు మీ జీవితాన్ని ఆరోగ్యంగా గడపటానికి అవసరమైన అత్యంత శక్తివంతమైన సాధనం గురించి వారికి ఎటువంటి శిక్షణా ఈయబడలేదు. విచారకరమైన విషయం ఏమిటంటే, మీరు ఏదో జబ్బుపడ్డారని తెలుసుకునేటప్పటికే, మీరు మీ ఆరోగ్యమైన, చైతన్యవంతమైన జీవితాన్ని కోల్పోయి ఉంటారు. రే స్ట్రేండ్ రాసిన ఈ విప్లవాత్మక గ్రంథం వర్తమానంలోనూ, భవిష్యత్తులోనూ మీ ఆరోగ్యాన్ని సురక్షితంగా ఉంచుకునేటందుకు కావల్సిన సులభమైన ఉపాయాలను వివరిస్తుంది. అంతేకాక, మీ వ్యాధిని, అది కలిగించే హానిని పోగొట్టి మీ ఆరోగ్యం కుదుటబడేలా చేస్తుంది. ఈ పుస్తకం మీకు చెప్పే విషయాలు • ప్రభుత్వ ఆసుపత్రులు సిఫార్సు చేసిన రోజువారీ పోషకపదార్థాలు శరీరంలోని ప్రకృతిసిద్ధమైన రక్షణకవచం వ్యాధులబారినుండి రక్షించటానికి తగినంత శక్తిని ఎందుకు కలగజేయటం లేదు? మనం వాటిని తీసుకోవలసిన మోతాదు ఏమిటి? • మీ శరీరంలోని ఆక్సిజన్ విచ్ఛిన్నం చెందటం మీకు ఎలాంటి ఉపద్రవం కలిగిస్తోంది? ఆ నష్టాన్ని పూడ్చటానికి మీరేం చేయాలి? • తరచూ వచ్చే అలర్జీలను, సైనస్ ఇన్ఫెక్షన్లనూ ఎలా ఎదుర్కుంటారు? • మీ డాక్టర్లిచ్చే మందులు క్షీణింపజేసే మీ దీర్ఘకాలిక వ్యాధులకు అత్యుత్తమ రక్షణను ఎందుకు కలగజేయటం లేదు? సుప్రసిద్ధ వైద్యవిజ్ఞాన పత్రికలలోని 1,300కి పైగా చికిత్సా అధ్యయనాలని విస్తృతంగా పరిశోధించి పరిజ్ఞానాన్ని గ్రహించాక, డా॥ ఫ్రెండ్, వయోవృద్ధి వేగాన్ని తగ్గించి, ఎంతో విధ్వంసాన్ని సృష్టించే వ్యాధుల నించి తిరిగి కోలుకునేందుకు సాయపడటంలో ముఖ్యమైన పాత్ర నిర్వహించే పోషక ఔషధాల గురించి విశదీకరించాడు. ఆ ప్రమాదకరమైన విధ్వంసాన్ని కలగజేసే వ్యాధులు • మధుమేహం • దీర్ఘకాలిక అలసట * క్యాన్సర్ • మల్టిప్ల స్కైరోసిస్ • గుండె జబ్బ\u003c\/p\u003e","brand":"Dusky's Shrine","offers":[{"title":"Paperback","offer_id":46038144548921,"sku":"9788183221627","price":359.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0795\/3367\/0457\/files\/71nv-aFqLVL._SL1500_19f7a26a-4e6f-4252-a874-a33d28677675.jpg?v=1782822328","url":"https:\/\/duskysshrine.com\/products\/what-your-doctor-doesnt-know-about-nutritional-medicine","provider":"Dusky's Shrine","version":"1.0","type":"link"}