{"product_id":"mega-cool-leaders-fihcr-telugu-edition","title":"మెగా-కూల్ నాయకులు: ఐదుగురు గొప్ప పాలకులు (mega-cool Leaders (fihcr Telugu Edition)","description":"\u003cp\u003eరండి, కాలంలోకి ప్రయాణిద్దాం. కాలానికి అతీతంగా జీవితాలను చరితార్థం చేసుకున్న ఐదుగురు మహానాయకులతో కలిసి నడుద్దాం. ఐదు విభిన్న ప్రాంతాలు, విభిన్న నేపథ్యాల నుంచి వచ్చి, జాతిని ముందుండి నడిపించిన నాయకులు. పాలన అంటే ప్రేమ అని నిరూపించి, ఇందోర్ కు శాశ్వతకీర్తి తెచ్చిన ఆహిల్యాబాయి హోల్కర్ నుంచి దక్షిణాన విజయనగర సామ్రాజ్యాన్ని ప్రపంచపటంలో సాంస్కృతిక రాజకీయ కేంద్రంగా నిలిపిన శ్రీకృష్ణదేవరాయల వరకూ అయిదుగురు దార్శనికులు. ప్రతి కథ చరిత్రను కళ్ళ ముందుంచుతుంది. ప్రాణాలకు తెగించి అస్సాంను వీరోచితంగా కాపాడుకున్న లచిత్ బర్ఫూకన్ గురించి చదువుదాం. హైందవీస్వరాజ్యస్థాపన కోసం నిరంతరం పోరాడిన ఛత్రపతి శివాజీ మహరాజ్ మాటలు విందాం. ఆసియా అంతటా కశ్మీర్ పతాక ఎగరేసిన లలితాదిత్య హృదయం లోకి తొంగిచూద్దాం. చక్కటి సరళమైన సంభాషణల రూపంలో అందిస్తూ, పిల్లలకు పెద్దలకు కూడా మధ్యమధ్యలో క్విజ్ రూపంలో ప్రశ్నలు, యాక్టివిటీలు అందిస్తూ, హాయిగా సాగిపోతుంది రచన. చరిత్ర ఇంత సరళమా అనిపిస్తుంది. నాయకత్వం అంటే విజయాలు మాత్రమే కాదు. మచ్చలేని వ్యక్తిత్వం, కష్టాలను దిగమింగి ముందుకు నడిచే లక్షణం అని తెలుసుకుంటాం. పర్సనాలిటీ డెవలప్మెంట్ పాఠాలు బోలెడు నేర్చుకుంటాం. ముఘల్ పరిధిని దాటి చరిత్రను అధ్యయనం చెయ్యడానికి పదేళ్లు దాటిన పిల్లలకు ఈ రచన ఒక స్టార్టర్ లా ఉపయోగపడుతుంది. చదివాక ఆ అయిదుగురూ మనతో చాలా కాలం ప్రయాణిస్తారు. అంతకంటే ఏం కావాలి! మా ప్రయత్నం అదే.\u003c\/p\u003e","brand":"Dusky's Shrine","offers":[{"title":"Paperback","offer_id":45907744587833,"sku":"9789365472813","price":269.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0795\/3367\/0457\/files\/71UlQlzj8SL._SL1500.jpg?v=1780499399","url":"https:\/\/duskysshrine.com\/products\/mega-cool-leaders-fihcr-telugu-edition","provider":"Dusky's Shrine","version":"1.0","type":"link"}